AP New Districts: అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర జిల్లాల పునర్విభజనపై కీలక మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమనే దృక్కోణంలో జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌ల పునర్విభజనపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పొంగూరు నారాయణ, బిజి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. వర్చువల్ ద్వారా కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
Tata Sierra: ధరల విషయంలో నిన్ను కొట్టేవాడు లేడు.. టాటా సియోర్రా ధర, బుకింగ్స్, డెలివరీ..
రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాల ఏర్పాటు పై విశ్లేషణ జరిగింది. ఈ జిల్లాల రూపకల్పనలో ప్రజలకు, పరిపాలనకు ఇబ్బందులు కలగకుండా మార్పులు, చేర్పులు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా ప్రతి జిల్లా సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతులు, పరిపాలనా యంత్రాంగం, రెవెన్యూ విభజనపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుపై కూడా సమగ్రంగా చర్చ జరుగుతోంది. భౌగోళిక పరిస్థితులు, జనాభా పంపిణీ, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
IND vs SA: టీమిండియా ముందర భారీ టార్గెట్.. వైట్ వాష్ తప్పదా..?