AP DGP Harish: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంపచోడవరాన్ని సందర్శించారు. ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లతో పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన జిల్లా పర్యటనకు వెళ్లారు. ఇటీవలి వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లలో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఆపరేషన్ ‘సంభవ్’లో కీలకమని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన తాజా వివరాలను సమీక్షించేందుకు, అదుపులోకి తీసుకున్న మావోయిస్టుల సమాచారం, వారి నెట్‌వర్క్ కార్యకలాపాలపై పోలీసు శాఖ డీజీపీ సమక్షంలో నివేదిక ఇవ్వనుంది.
ఈ సందర్భంగా ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. మారేడిమిల్లి అటవి ప్రాంతంలో రెండు ఎన్ కౌంర్లు జరిగాయి.. హిడ్మా, టెక్ శంకర్ గ్రూపులకు సంబంధించిన మొత్తం 13 మంది ఎన్ కౌంటర్ అయ్యారు.. మిగిలిన మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నాం.. సంభవ్ ఆపరేషన్ కొనసాగుతుంది.. మావోయిస్టులను నిర్మూలించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు.