Ponguleti Srinivas reddy : ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అయితే, గత 15 నెలలుగా ఇందిరమ్మ పాలనలో రాష్ట్రం…
Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ వినూత్న నిరసనకు దిగారు. బైక్ సర్వీస్ కోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
వైసీపీకి పిల్లి బోస్ గుడ్‌బై చెబుతారనే చర్చ జోరుగా సాగుతోంది.. ఇదే సమయంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట బోస్.. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో పిల్లి బోస్ ఉన్నారని తెలుస్తోంది.
రామచంద్రాపురం పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.. ఎంపీ పిల్లి బోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంతో జరిగిన సమవేశంలో మంత్రి వేణు గోపాలకృష్ణ తీరుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు బోస్.. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు.
రామచంద్రాపురంలో జరిగిన ఘటనతో తాతాల్కికంగా తమ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు అమరావతి రైతులు.. పాదయాత్రకి నాలుగు రోజులు విరామం ప్రకటించారు.. పోలీసులు తీరుకు నిరసనగా పాదయాత్ర నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు… పోలీసుల తీరుపై కోర్టులో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రైతులు.. ప్రస్తుతం కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో.. తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చామన్నారు.. అయితే, ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి.. అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు ఆపలేదని స్పష్టం చేశారు.. దీనిపై…
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం బ్రహ్మపూరి గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల కులవివక్షత చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు మరో పాఠశాల ఏర్పాటు చేసి బోధన ..దీంతో కుల వివక్షతకు ఆజ్యం పోసిన మండల విద్యాశాఖ అధికారులు. గ్రామ పంచాయితీ సర్పంచ్ సూచనలు మేరకు విద్యార్థుల మధ్య కుల విభజన చేశారంటూ ఆరోపణలు…
కొత్త ఎమ్మెల్సీల ఎంపిక తర్వాత ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు మరోసారి తెరలేచింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉండటంతో రాజకీయం మూడుముక్కలాటలా మారిందా?. వారసులను రంగంలోకి దించేలా ఒకే బరిపై ముగ్గురు గురిపెట్టారా?. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం. ముగ్గురు నేతలు మూడు కీలకపదవుల్లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో…