Sangareddy: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ వినూత్న నిరసనకు దిగారు. బైక్ సర్వీస్ కోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. షోరూం వద్దకు వచ్చిన కస్టమర్ లు షోరూం కు చెప్పుల దండ వేశారు. వినూత్నంగా నిరసన తెలిపారు. బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో.. ఓ కస్టమర్ నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చాడు. నెల రోజులు అయిపోయినా షో రూమ్ నుంచి స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయాడు. రోజూ ఫోన్ చేసి వాహనం గురించి అడిగి సిబ్బంది మాత్రం అతని కాల్స్ కు పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన కస్టమర్ ఏకంగా షోరూం వద్దకు వచ్చాడు. అయినా అక్కడ సిబ్బంది ఆయన్ను పట్టించుకోలేదు. చివరకు తనతో పాటు తెచ్చుకున్న చెప్పుల దండను షోరూంకి వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో ఈ వార్త రామ చంద్రపురంలో వైరల్ గా మారింది.
Read also: Kishan Reddy: టెక్నికల్ సమస్యల పేరుతో ఆలస్యం చేయడం తగదు..
కస్టమర్ మాట్లాడుతూ.. ఓలా ఈవీ షోరూంలో కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనం తీసుకున్నాని తెలిపారు. బ్యాటరీ రేంజ్ పడిపోవడంతో షోరూంలో బైక్ ను సర్వీస్ కు ఇచ్చా అన్నాడు. అయితే నెలల తరబడి కాల్ చేసినా ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డారు. రోజూ షోరూం కు వచ్చి వెళుతున్నానని మండిపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు నెల రోజులు అయినా యాజమాన్యంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకే చెప్పుల దండతో వినూత్నంగా నిరసన తెలిపానని పేర్కొన్నాడు. ఇంత జరుగుతున్నా బైక్ గురించి యాజమాన్యం ఎటువంటి వివరాలు ఇవ్వడం లేదని మండిపడ్డాడు. ఇప్పటి కైనా తన బైక్ సర్వీసింగ్ చేసి తిరిగి ఇవ్వాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
Ponguleti Srinivas: కార్ల రేసింగ్‌తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి?.. కేటీఆర్ పై పొంగులేటి ఫైర్..