దర్శకరత్న దాసరి నారాయణ కోసం రిజిస్టర్ చేసిన 'దేశం కోసం' అనే టైటిల్ ను రవీంద్ర గోపాల కోరడంతో ఇచ్చేశానని నిర్మాతల మండలి అధ్యక్షుడి సి. కళ్యాణ్ తెలిపారు. భగత్ సింగ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 10వ తేదీ విడుదల కాబోతోంది.
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. ‘బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందని ఈ మూవీ తెలుగు…