అందం, అభినయం కలబోసిన రూపం ఉన్నా ఎందుకనో రమాప్రభ నాయికగా రాణించలేక పోయారు. 1970ల ఆరంభంలోనే స్టార్ కమెడియన్ అనిపించుకున్నారు రమాప్రభ. అప్పట్లో ఎంతోమంది సినిమా ప్రయత్నాలు చేసేవారికి రమాప్రభ అండగా నిలిచారు. కొందరికి ఆర్థిక సాయం, మరికొందరికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ‘కన్నెవయసు’ చిత్రంలో హీరోగా నటి
Rama Prabha: తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కొంతమంది నటులను తెలుగు అభిమానులు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ముఖ్యంగా కామెడీ పంచిన కమెడియన్లను అయితే అస్సలు మరువరు. రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, బ్రహ్మానందం.. వీరి గురించి ఎప్పుడు మాట్లాడిన పెదాల్లో ఒక చిరునవ్వు వస్తోంది.
Rama Prabha: ఇప్పుడంటే ముసలి పాత్రల్లో అడపాదడపా తెరపై కనిపిస్తూ ఉన్నారు కానీ, ఒకప్పుడు రమాప్రభ తన హాస్యంతో వెండితెరను భలేగా వెలిగించారు. నిజానికి రమాప్రభ గ్లామర్ అప్పటి తారల అందానికి ఏమీ తీసిపోనిదే.
రమాప్రభ పుట్టినరోజు ఏది? అన్న సందేహం చాలామందికి కలగవచ్చు. ఎందుకంటే ఆమె పుట్టినరోజు మే 5 అని కొన్ని చోట్ల, ఆగస్టు 5 అని మరికొన్ని చోట్ల, అక్టోబర్ 5 అని ఇంకొన్ని చోట్ల దర్శనమిస్తోంది. ఇంతకూ రమాప్రభ అసలైన పుట్టినరోజు ఏది? రమాప్రభ 1947 అక్టోబర్ 5న జన్మించారు. ఆ రోజు ఆదివారం. రమాప్రభకు తాను ఏ రోజున పుట్టింది త�