Rama Prabha: తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కొంతమంది నటులను తెలుగు అభిమానులు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ముఖ్యంగా కామెడీ పంచిన కమెడియన్లను అయితే అస్సలు మరువరు. రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, బ్రహ్మానందం.. వీరి గురించి ఎప్పుడు మాట్లాడిన పెదాల్లో ఒక చిరునవ్వు వస్తోంది. ఇక ఒకప్పుడు ఎంతో బాగా బతికిన నటులు.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియాలో కొంతమంది నటులు చనిపోయారని, వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు అంటూ వార్తలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇక తాజగా కొన్నిరోజుల నుంచి లేడీ కమెడియన్ రమాప్రభ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తుంది అని, కొందరి దగ్గర అడుక్కు తింటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు అనే రేంజ్ లో మండిపడింది.
Nandamuri Kalyan Ram: తమ్ముడొస్తున్నాడు.. మాట్లాడుకుందాం
“నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. కొందరి దగ్గర అడుక్కొని తింటున్నాను.. ఎవరైనా సాయం చేయండి అంటూ నాపై వార్తలు వచ్చాయి. వాటిని నేను కూడా చూసాను.. మొన్నీమధ్యనే నా సొంత యూట్యూబ్ ఛానెల్ లో నా ఇంటిని మొత్తం చూపించాను. ఇంతపెద్ద ఇల్లు పెట్టుకొని ఎవడైన అడుక్కుతింటాడా..? నేను అడుక్కుతింటే.. ఈ ఇల్లు ఎవరిది మరి.. చెప్పండి. ఈ వయస్సులో కూడా నేను బిజీగా పనిచేస్తున్నాను.. ఇండస్ట్రీలో నాగార్జున, పూరి జగన్నాథ్ లాంటివారు సాయం చేస్తున్నారు. అది భిక్ష ఎలా అవుతోంది.. వాళ్ళు నన్ను ఇంటిమనిషిలా చూస్తున్నారు. దాన్ని మీరెలా భిక్ష అంటారు. అది వారి ప్రేమ.. వారేదో భిక్ష వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మేము అంతా కుటుంబంలా కలిసి ఉన్నామని నేను అంటున్నాను.. నిజం చెప్పాలంటే అందరికంటే నేను రిచ్ గా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.