రమాప్రభ పుట్టినరోజు ఏది? అన్న సందేహం చాలామందికి కలగవచ్చు. ఎందుకంటే ఆమె పుట్టినరోజు మే 5 అని కొన్ని చోట్ల, ఆగస్టు 5 అని మరికొన్ని చోట్ల, అక్టోబర్ 5 అని ఇంకొన్ని చోట్ల దర్శనమిస్తోంది. ఇంతకూ రమాప్రభ అసలైన పుట్టినరోజు ఏది?
రమాప్రభ 1947 అక్టోబర్ 5న జన్మించారు. ఆ రోజు ఆదివారం. రమాప్రభకు తాను ఏ రోజున పుట్టింది తెలుసు. కానీ, కొన్ని పత్రికల్లో వచ్చిన తప్పుడు తేదీలనే ఇప్పటికీ ఎంతోమంది ఫాలో అవుతున్నారు. అందువల్ల అభిమానులు మే 5న, ఆగస్టు 5న, అక్టోబర్ 5న రమాప్రభకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. అక్టోబర్ 5 తన పుట్టినరోజు అని స్వయంగా రమాప్రభ చెప్పినా, అభిమానులు మాత్రం తమకు గుర్తున్న తేదీలలో ఆమెను గుర్తు చేసుకొని మరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలా ఒకే సంవత్సరంలో మూడు సార్లు అభినందనలు అందుకోవడం విశేషమే కదా! అభిమానుల ఆనందాన్ని ఎందుకు కాదనాలి అంటూ రమాప్రభ సైతం వారి గ్రీటింగ్స్ ను స్వీకరిస్తున్నారు.