Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి.
2024 జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ఠ" విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, హాజరైనవారికి పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుండి 'అయోధ్య దర్శన్' పుస్తకం కాపీలను అందించనున్నట్లు చెప్పారు.
Ram Mandir: భుజంపై కాషాయ జెండా, వీపుపై రామమందిరం ఫోటో, ఒంటిపై హిజాబ్ ధరించిన యువతి షబ్నమ్. రాముని భక్తిలో మునిగిపోయిన ఈ యువతి ముంబై నుండి అయోధ్యకు బయలుదేరింది.
Ram Mandir: నూతనంగా నిర్మించిన రామజన్మభూమి ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య అంతా సిద్ధమైంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ హాజరుకానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. 2024 జనవరి 22న శ్రీరాముడితో పాటూ ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Ram Mandir Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. నిర్మాణ స్థలంలో త్రవ్వకాలలో, పురాతన దేవాలయానికి సంబంధించిన కొన్ని అవశేషాలు కనుగొనబడ్డాయి.
కోట్లాది భారతీయ రామభక్తుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంతో సాకారం కాబోతోంది. ఇప్పుడు శ్రీరాముడి విగ్రహం ఆలయం రూపుదిద్దుకుంటుంది. మరి కొన్ని నెలల్లో రాముడు తన ఆలయంలో కొలువు తీరనున్నాడు. అయితే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే ప్రదేశంలో రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు.
అయోధ్యలోని మూడంతస్తుల రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ ఆలయాన్ని వచ్చే జనవరిలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పనులు చివరి దశలో ఉన్నాయని.. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు.
పవిత్ర గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కాశీనాథుడి దర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
Ram Mandir: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు కోటి కళ్లలో రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2024లో జనవరిలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ సారి శ్రీరామ నవమి వేడుకలు అయోధ్య రామ మందిరం సిద్ధం అవుతోంది. రామ నవమి వేడుకలు తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆలయ నిర్మాణం పూర్తై, రామ మందిరంలోనే నవమి వేడుకలు జరగనున్నాయి.