వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ హాజరుకానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. 2024 జనవరి 22న శ్రీరాముడితో పాటూ ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Read Also: Nimmagadda Ramesh Kumar: ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు..
వీరితో పాటు.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ఆహ్వానితులైన వారిలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఇంకా ఈ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. రాజకీయ నాయకులు, పూజారులు, సాధవులతో పాటు మొత్తం 6 వేల మందికి ఆహ్వానం పంపింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. వీరితో పాటు.. 1990లో జరిగిన రామమందిర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు. పలువురు జర్నలిస్టులు, మాజీ ఆర్మీ అధికారులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, లాయర్లు, పద్మ అవార్డు గ్రహీతలను కూడా రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
Read Also: DGP: రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
కాగా.. అయోధ్యలో మొత్తం 8.64 ఎకరాల్లో నిర్మి్స్తున్న రామమందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. గర్భగుడితో పాటూ గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపాన్ని నిర్మించారు.