Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయోధ్యతో పాటు యూపీ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులు ఈ వేడులకు అతిథులుగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Ram Mandir : అయోధ్యకు సంబంధించి రోజుకో కొత్త వార్తలు వస్తున్నాయి. జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. సన్నాహాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
అయోధ్యలో శ్రీరామ ఆలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవుతున్నాయి. ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు మొత్తం 7000 మందికి పైగా ముఖ్య అతిథులు హాజరవుతున్నారు. లాల్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
Congress: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు కాంగ్రెస్ వెళ్తుందా..? లేదా..? అనే సందేహాలకు తెరపడింది. ఈ కార్యక్రమానికి తాము హాజరయ్యేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రామ మందిర వేడుక పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమంగా ఉందని ఆరోపించింది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది.
అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయంలో రాంలల్లా ప్రాణప్రతిష్ట కోసం భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యకు ప్రతి రోజూ మూడు లక్షల మందికి పైగా ప్రజలు సందర్శిస్తారని అంచనాలు వేస్తున్నారు.
జార్ఖండ్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.29 గంటలకు శుభ ముహూర్తంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపణ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే.. ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రామజన్మభూమి తీర్థ క్షేత్ర…
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ మరోసారి భారత్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అయోధ్యలో రామ మందిరంలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజు అమృత్సర్ నుంచి అయోధ్య వరకు ఎయిర్పోర్టులు అన్ని మూసివేయాలని పిలుపునిచ్చాడు.