Ayodhya Ram Mandir: కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామమందిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పుల్వామా దాడి తరహాలో రామమందిర నిర్మాణం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని కర్ణాటక మంత్రి డీ సుధాకర్ అన్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వెనక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాల గురించి సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టిని మరల్చడమే కాకుండా, ఓటర్లను ప్రభావితం చేసే వ్యూహంగా దీనిని అభివర్ణించారు.
Read Also: American Military: ఎర్ర సముద్రంలో యూఎస్ నేవీ వర్సెస్ హౌతీ రెబల్స్.. నౌకల్ని ముంచేసిన నేవీ..
‘‘ ఇవన్నీ కేవలం స్టంట్స్, ముందుగా పుల్వామాను చూపించారు, ఇప్పుడు రాముడి ఫోటోను ప్రదర్శిస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. రెండుసార్లు మోసపోయారు, మూడోసారి మోసపోరని నేను నమ్ముతున్నారు’’ అని మంత్రి సుధాకర్ అన్నారు. రామమందిర నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ విరాళాలు, ఇటుకలను అందించారని సుధాకర్ పేర్కొన్నారు. శ్రీరాముడు అందరికీ పూజ్యనీయుడే అని, భేదాభిప్రాయాలు వద్దని చెప్పారు.
ఆధ్యాత్మికత ముసుగులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు పుల్వామా దాడిని ఉపయోగించుకున్నారని, వారు దేశాన్ని రక్షిస్తారని నమ్మి ప్రజలు ప్రభావితమయ్యారని, గతంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు..? అని పరోక్షంగా బీజేపీని ప్రశ్నించారు.