Ram Mandir Inauguration: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట పవిత్రోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ శ్రీరాముని కార్యంలో నిమగ్నమై ఉన్నారు. జనవరి 22న రామాలయంలో రామ్‌లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.
Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కన్నుల పండగగా సాగే ఈ మహత్తర ఘట్టం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జనవరి 22న భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తగా 7000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కీలక రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు, స్పోర్ట్స్ స్టార్స్‌లతో పాటు సాధువులు ఈ…
Ram Mandir: అయోధ్యంలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.
Dhirendra Shastri: రామాలయ ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో, కేంద్రం చేస్తున్న కార్యక్రమాలపై ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర శాస్త్రి శుక్రవారం స్పందించారు. ‘‘ఇది అతడి భయాన్ని తెలియజేస్తోందని, మేము మసీదులపై మందిరాలను నిర్మించడం లేదని, దేవాలయాలను పునర్నిర్మించాలని అనుకుంటున్నామని, అతడికి ఈ భయం ఉంటే, ఆ భయంతోనే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అంటూ ఓవైసీని ఉద్దేశిస్తూ అన్నారు.
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు.
ఈ నెల 22న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదుల్లో ముస్లిం యువత ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మసీదులను కూడా తమ నుంచి తీసేసుకునే ఛాన్స్ ఉందన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 22న రామాలయంలో రాంలాలా జీవితం పవిత్రం కానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్షణం కోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపు ఢిల్లీలో రామ మందిరం శంకుస్థాపన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు కూడా హాజరు…
QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Ayodhya Ram Mandir: కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామమందిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పుల్వామా దాడి తరహాలో రామమందిర నిర్మాణం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని కర్ణాటక మంత్రి డీ సుధాకర్ అన్నారు.