QR code scam: రామమందిరం పేరిట భక్తుల్ని లూటీ చేస్తున్న “క్యూఆర్ కోడ్ స్కామ్”.. వీహెచ్‌పీ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహా రామాలయ సంప్రోక్షణకు కొన్ని వారాలే సమయం ఉండగా.. భక్తులను మోసం చేస్తూ, వారి నుంచి నకిలీ విరాళాలు సేకరిస్తున్న రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ ‘విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. ఈ మోసానికి గురికావద్దని ప్రజలను కోరుతూ.. సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసింది.
వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ ట్వీట్ చేస్తూ.. “శ్రీ రామ జన్మభూమి తీర్థ ఛేత్రా అయోధ్య, ఉత్తరప్రదేశ్” పేరుతో ఒక నకిలీ సోషల్ మీడియా పేజీని సృష్టించినట్లు వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన పేజీని, రామ మందిర నిర్మాణం పేరుతో నిధులనున అందించమని భక్తుల్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మోసం గురించి ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు వెల్లడించారు.
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
Read Also: New Year 2024: న్యూఇయర్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?
రామాలయం పేరుతో విరాళాలనున కోరిన వ్యక్తి, మీకు చేతనైనంత విరాళం ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు విరాళం ఇచ్చిన వారి పేర్లు డైరీలో నమోదు చేసుకుని, ఆలయం పూర్తైన తర్వాత అయోధ్యకు ఆహ్వానిస్తానని నమ్మబలుకుతున్నారు. అంతే కాకుండా ‘‘ ముస్లిం సమాజం, హిందూ సమాజానికి మధ్య పోరాటం జరుగుతోందని తెలుసు, ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతించడం లేదని, అందుకే తమ ఆలయం కోసం నిధులు సేకరిస్తున్నాం’’ అంటూ మోసగాళ్లు ప్రజల్ని లూటీ చేస్తున్నారు. రామ మందిరం పేరులో ప్రజల మధ్య విభేదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
రామమందిరం పేరిట నిధులు సేకరించేందుకు ఎవరికీ అధికారం లేదని, ప్రజలు ఇలాంటి మోసాలకు గురికావద్దని వీహెచ్‌పి చెప్పింది. దీనిపై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి లేఖ రాసినట్లు తెలిపింది.
सावधान..!!
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के नाम से फर्जी आईडी बना कर कुछ लोग पैसा ठगी का प्रयास कर रहे हैं। @HMOIndia @CPDelhi @dgpup @Uppolice को ऐसे लोगों के विरूद्ध विलम्ब कार्यवाही करनी चहिए। @ShriRamTeerth has not authorised any body to collect funds for this occasion. pic.twitter.com/YHhgTBXEKi— विनोद बंसल Vinod Bansal বিনোদ বনসল వినోద్ బన్సాల్ (@vinod_bansal) December 31, 2023
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?