Ram Mandir: అయోధ్యలోని రామాలయంలో రాంలాలా పవిత్రోత్సవం సందర్భంగా మహావీర్ ఆలయంలో కూడా వేడుకలు నిర్వహించనున్నారు. మహావీర్ ఆలయం దక్షిణ మూలలో ఉన్న సీతారాముల విగ్రహం ముందు నేడు ఉదయం 9 గంటల నుండి అఖండ కీర్తన నిర్వహించబడుతుంది.
Ram Mandir Features: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహం ఆలయ గర్భగుడికి చేరుకుంది. ఈ రోజు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రతిష్ట తర్వాత బాల రాముడు వివిధ పూజలు చేయనున్నారు.
Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. రామ మందిర ఆలయ గుర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Bank Holiday : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చే వారం అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుంది. వచ్చే వారం జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమ ముహూర్తంగా నిర్ణయించారు.
అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. మరో ఐదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. కాగా.. బుధవారం తొలిసారిగా రామయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. డప్పు, వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. కాగా.. గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో.. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు.
Karnataka: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గర పడుతున్నా కొద్ది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి రాజన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండు బొమ్మల్ని టెంటులో ఉంచి వాటినే రాముడని అన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత ఇప్పుడు భక్తులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగి పాత వృత్తులు కాకుండా కొత్త వృత్తులు అవలంబిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భూమి కొనుగోలు నుండి హోటల్ వ్యాపారం వరకు, అయోధ్య ప్రజలు కొత్త ఉపాధి కోసం చూస్తున్నారు. అయోధ్యలోని నయా ఘాట్కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిహురా మజ్హాన్ గ్రామంలో అమితాబ్ బచ్చన్ భూమిని కొనుగోలు…
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది
Ram Lalla idol: కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్నారు. కృష్ణ శిలలతో చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట కోసం ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం సోమవారం ధృవీకరించింది. ఈమేరకు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అంతకుముందు రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం అరుణ్ యోగి రాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేస్తామని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చెప్పారు.…