Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిషృతమైంది. రామ మందిర ఆలయ గుర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. గురువారం తెల్లవారుజామున గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడి ప్రాంగణంలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం సమయంలో భక్తులు పెద్ద ఎత్తున ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తీసుకువచ్చే ముందు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Also: Iran’s strikes in Pakistan: “ఆత్మరక్షణ కోసమే”.. పాకిస్తాన్‌పై ఇరాన్ దాడి.. భారత్ స్పందన..
ప్రాణ ప్రతిష్ట వేడుకలకు ముందు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రాముడి విగ్రహాన్ని బుధవారం సాయంత్రం అయోధ్య ఆలయానికి చేరుకుంది. సుమారుగా 150-200 కిలోల బరువున్న విగ్రహాన్ని సాయంత్రం ఊరేగింపుతో ఆలయానికి తీసుకువచ్చారు. గురువారం గర్భగుడిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
జనవరి 22న రామాలయంలో ప్రాణప్రతిష్ట వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు బుధవారం ‘కలశ పూజ’ జరిగింది. 121 మంది ఆచార్యులు పూజా క్రతువులను నిర్వహిస్తు్న్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభై 1 గంటకు ముగుస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, సాధువులు, స్పోర్ట్స్, సినీ ప్రముఖులతో సహా 7000 మందికి పైగా అతిథులు రాబోతున్నారు.