అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద మాట్లాడుతూ.. శంకరాచార్యులకు వారి స్వంత గౌరవం ఉంటుంది.. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు.. ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు మనం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా?.. సంప్రదాయాలను తారుమారు చేయడం లౌకిక ప్రభుత్వం చేసే పని కాదు అని ఆయన పేర్కొన్నారు.
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు.
ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా కలలోకి రాముడు వచ్చి.. జనవరి 22న అయోధ్యకు వెళ్లబోమని చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.
Ram Mandir Inauguration: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22న అట్టహాసంగా జరగబోతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూపీలో యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులతో పాటు దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులు అతిథులుగా వెళ్తున్నారు. మొత్తం 7 వేల మంది వరకు…
Ram Mandir : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM), దేశంలోని చాలా మంది ముస్లింలు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.
Narendra Modi : జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్నారు.
Ram Mandir : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య ప్రాంతమంతా రాములోరి రాక కోసం రమ్యంగా మారింది.
Seema Haider: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు కూడా వస్తున్నారు. వీరితో పాటు లక్షలాది మందితో అయోధ్య నగరం నిండిపోనుంది. రామభక్తులు ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నగరంలో పండగ వాతావరణం నెలకొంది.
Himanta Biswa Sarma: రామ మందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ వేడకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. దేశంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు 7000 మంది అతిథులుగా రాబోతున్నారు. ఇప్పటికే అయోధ్య నగరం ఈ వేడుక కోసం ముస్తాబైంది. యూపీతో పాటు దేశమంతట పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలను ఆహ్మానించినప్పటికీ తాము రాబోవడం…