నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. ఈ న్యాయమూర్తులందరినీ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. అంతే కాకుండా.. మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానితుల జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్…
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రముఖ న్యాయవాది పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో.. 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. అందుకోసం.. విమానాల పార్కింగ్ కోసం 12 విమానాశ్రయాలను సంప్రదించారు. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది. జనవరి 22న ఆలయ గర్భగుడిలో ఇదే విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా.. ఈ విగ్రహం కృష్ణ శిలతో తయారైంది. విగ్రహం పొడవు 51 అంగుళాలు.. బరువు 150 కేజీలు. అయితే.. బాలరాముడి విగ్రహం గురువారం గర్భాలయానికి చేరుకుంది. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన భక్తులు..…
జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తోంది. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులకు రాముడి దర్శనం ఉంటుందని…
జనవరి 22న కేంద్ర కార్యాలయాలకు సగం రోజుల సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు కూడా హాప్ డే సెలవు ఇచ్చారు.
Ram Mandir : రామమందిర ప్రతిష్టకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు.
Ram Mandir : టాంజానియన్ కంటెంట్ సృష్టికర్త కిలి పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను రూపొందించడంలో చాలా పాపులర్. తను తరచుగా భారతీయ పాటలకు పెదవి సింక్ చేయడం, కొన్నిసార్లు బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేయడం అందరికీ తెలిసిందే.
Ayodhya Ram Mandir: శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. గర్భగుడిలో బాల రాముడి (5 ఏళ్ల రాముడి…
Ram Mandir: జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గురువారం రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సాధువులతో సహా మొత్తం 7000 మంది అతిథులు హాజరవుతున్నారు.