మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే RRRతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. చిరు, చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్లలో వేగం పెంచారు. ఇందులో భాగంగా టాలీవుడ్ మీడియాతో…
‘ఆచార్య’తో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ రెడీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ‘ఆచార్య’ టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్స్టార్ తాజా ప్రెస్ మీట్…
తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘జెర్సీ’ హిందీ మూవీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చెర్రీ తన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని అభినందించారు. ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట్ నేపథ్యంగా కనిపించినా, అందులో కేవలం…
ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అది అప్పుడు అలా జరుగుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆరంభించినప్పుడు వెంటనే మరో మల్టీస్టారర్ లో నటిస్తానని తాను ఊహించలేదని చెప్పారు చెర్రీ. ‘ఆర్.ఆర్.ఆర్.’ అనుకున్న సమయానికి విడుదలయి ఉంటే అనుకుంటాం కానీ, ఏది మన చేతుల్లో ఉండదని అన్నీ అలా సమకూరినప్పుడే మంచి ప్రాజెక్ట్స్ మన సొంతమవుతాయని చెర్రీ తెలిపారు. అనుకోకుండా కేవలం రెండు నెలల వ్యవధిలో ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్స్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా తన తండ్రి చిరుతో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్…
ఈ మధ్యే విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ అంటే డైరెక్టర్ రాజమౌళి, హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ను సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు. అదే తీరున ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మరో నోటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోవడం విశేషం! ఆదివారం (ఏప్రిల్ 24న) ఈ ఇంటర్వ్యూ జరిగింది. సరిగ్గా 35 రోజుల వ్యవధిలో రెండు…
టాలీవుడ్ లోని అందమైన సెలెబ్రిటీ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. చెర్రీ సినిమాలతో బిజీ, అయితే ఉపాసన కుటుంబం, బిజినెస్, సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. యువత శరీరానికి అనుకూలమైన ఆహారం, ఆరోగ్య అలవాట్ల గురించి సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక భర్త గురించి చెప్పినప్పుడల్లా రామ్ చరణ్ ను ‘మిస్టర్ సి’ అంటూ కొత్త పేరును పెట్టేసింది. ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్న ఈ జంట తాజా…
రాకింగ్ స్టార్ యష్ నటించిన “కేజీఎఫ్ చాప్టర్ 2” ప్రస్తుతం స్లో అయ్యే మూడ్లో లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శాండల్వుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 10 రోజుల క్రితం విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. “కేజీఎఫ్ చాప్టర్ 2″కు ఫిదా అయిన స్టార్స్ జాబితాలో…
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో భారీ అంచనాలున్న సినిమాల్లో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరిగింది. 133 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేశాడు ‘ఆచార్య’. ఈ చిత్రం యొక్క USA రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మరి ‘ఆచార్య’ చిత్రం నిజంగా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ఈవెన్ను సాధిస్తుందా? అనేది…