టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే ! ఎవరి అభిమానులకు వాళ్ళ హీరోల డ్యాన్స్ సూపర్ అన్పించడం సాధారణమే. ఇక అందులో మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్ కు పడి చచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ లో తండ్రిని మించిన తనయుడు అన్పిస్తున్న విషయం తెలిసిందే. మరి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ మెచ్చే బెస్ట్ డ్యాన్సర్ టాలీవుడ్ లో ఎవరు? ఇదే ప్రశ్నను దర్శకుడు హరీష్ శంకర్ ఈ మెగా తండ్రీకొడుకులు తాజాగా అడిగారు. ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ ‘ఆచార్య’ టీంతో జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నను సంధించారు.
Read also : Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్
టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరనే విషయంపై చిరు, చెర్రీ ఇద్దరూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ , ఎన్టీఆర్, రామ్ పోతినేని, నితిన్ తో పాటు ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ డ్యాన్సర్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ స్పందిస్తూ బన్నీ, తారక్ లు బెస్ట్ డ్యాన్సర్స్ అని అన్నారు. వీరిద్దరి డ్యాన్స్ చూస్తే అలా ఉండిపోతానని, వీళ్ళతో కష్టం అన్పిస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తానికి చెర్రీ డ్యాన్స్ లో పోటీగా ఫిల్ అయ్యేది అల్లు అర్జున్, తారక్ ను అన్నమాట.