మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. ఈ మూవీ రేపే థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టిన మేకర్స్ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో అత్యంత భారీ సెట్ ను నిర్మించినట్టు దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా కథకు సరిపోయే భారీ టెంపుల్ ఎక్కడా కన్పించకపోవడంతో, ఒక సెట్ ను నిర్మించి, అందులోనే షూటింగ్ అంతా పూర్తి చేశారు.
Read Also : Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్
‘ధర్మస్థలి’గా రూపొందిన ‘ఆచార్య’ భారీ సెట్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. లోపలంతా తిరిగి అందులో ఉన్న విశేషాలను వెల్లడించారు. కోకాపేట్ లో నిర్మించిన ఈ ధర్మస్థలి కొంచం పాతకాలం నాటి లుక్ లో ఆకట్టుకుంటోంది. దాదాపు 20 ఎకరాల్లో నిర్మించిన ఈ సెట్ లో అగ్రహారాలు, మండపాలు, గాలి గోపురాలు, లోపల ఓ భారీ విగ్రహం ఉన్నాయి. దాదాపు ఒక టౌన్ నే నిర్మించేశారు. ఈ భారీ సెట్ ను చూసి మెగా ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఈ ధర్మస్థలిని ఒకసారి వీక్షించండి.