“ఆచార్య” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో మెగా తండ్రికొడుకులతో పాటు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ‘ఆచార్య’ టీం డైరెక్టర్ హరీష్ శంకర్ తో జరిపిన చిట్ చాట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి హైలెట్ సీన్ గురించి, ‘ఆచార్య’ సోల్ గురించి మాట్లాడారు. చిరు, చరణ్ ఇద్దరూ కలిసి ఒక సన్నివేశం షూట్ చేశారట. ఆ సమయంలో అసలు సీన్ ఎలా వచ్చింది ? అనే విషయం ఎవరూ చెప్పట్లేదట. ఓకేనా ? లేక మరో టేక్ తీసుకోవాలో తెలియక మేము టెన్షన్ లో పడ్డాము. లంచ్ బ్రేక్ అని చెప్పినా ఎవరూ కదలట్లేదు. మేమే టైం తీసుకుని ఎవరూ కదలట్లేదండీ ఆ సీన్ చూసి అంటూ కొరటాల గారికి చెప్పాము. అప్పుడు మానిటర్లో ఆ సీన్ ను చూసిన అందరూ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి కదిలారు. చెర్రీ ఆ సీన్ లో గుండెల్ని పిండేసేలా నటించాడు.
Read Also : Ajay Devgn : కన్నడ స్టార్ కు కౌంటర్… లాంగ్వేజ్ వార్
అదే సినిమాకు సోల్… ఆ సీన్ క్లైమాక్స్ కు లీడ్… అదే సినిమాను నిలబెడుతుంది అంటూ కీలకమైన విషయాన్ని వెల్లడించారు చిరు. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ బిగ్గెస్ట్ హైలైట్ కానుందని సమాచారం. చిరుతో ఫైట్ సీన్ తో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్. తండ్రీకొడుకుల యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని, అభిమానులను ఆకట్టుకునేలా సినిమా ఆద్యంతం ఉంటుందని సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.