దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే అది కేవలం సినిమా వరకే స్పెషల్ కాదు.. అన్నిటిలోనూ జక్కన్న మార్కు ఉండాల్సిందే. ప్రమోషనల్స్ అయినా, ప్రమోషనల్ సాంగ్ లోనైనా ఆ మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక రాజమౌళి లో ఉన్న మరో స్పెషల్ ఏంటంటే.. తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఒక్క షాట్ లోనైనా కనిపించి మెప్పిస్తూ ఉంటాడు. అది సీన్ అయినా.. ప్రమోషనల్ సాంగ్ అయినా రాజమౌళి కనిపించాల్సిందే. ‘మగధీర’ దగ్గరనుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు జక్కన్న మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ లోని ప్రమోషనల్ సాంగ్ ‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ముందు నుంచి ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ గురించి అందరు మాట్లాడుకునేది. కానీ ఈ సాంగ్ లో మాత్రం చివరన వచ్చే రాజమౌళి డాన్స్ గురించి మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలో ఎండ్ టైటిల్స్ పడే సమయంలో ‘ఎత్తర జెండా’ పాట వస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఎన్టీఆర్, తారక్ మధ్యలో అలియా తమదైన డాన్స్ స్టెప్పులతో దుమ్ము లేపేయగా చివరన చిత్ర బృందం మొత్తం సాంగ్ లో స్టెప్స్ వేయడం సర్ ప్రైజింగ్ గా ఉంది. అజయ్ దేవగన్, హాలీవుడ్ భామ ఒలివియాతో పాటు రాజమౌళి కూడా డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇక ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా .. విశాల్ మిశ్రా ,పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి , హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. తన హీరోలతో కలిసి జక్కన్న స్టెప్పులు వేయడం బావుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ పై ఓ లుక్ వేసేయ్యండి.
https://youtu.be/ccbp0_ZqMBY