“ఆచార్య సినిమాలో సిద్ధగా చరణ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో పవన్ కళ్యాణ్ చేసినా అంతే ఆనందపడేవాడిని” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు ఆచార్య టీమ్ .. మీడియాతో సమావేశం అయిన విషయం విదితమే. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి చిరు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
” సిద్ద పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా..?” అని రిపోర్టర్ అడిగిన ప్రశాంకు చిరు సమాధానమిస్తూ” చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా న్యాయం చేస్తారు.. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. రియల్ గా ఉన్నటువంటి తండ్రి గుణం యాడ్ అవుతుంది అనే ఉద్దేశ్యంతోటే చరణ్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఆ పాత్రకు చరణ్ కూడా దొరకకపోతే.. ది బెస్ట్ ఆల్ట్రనేట్, ఆ ఖాళీని పూరించేది, అదే ఫీల్ నాకిచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.. పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు వంద శాతం అదే ఫీల్ ఉంటుంది.. కానీ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు.. అన్ని కుదిరిపోయాయి అలాగా” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి.