చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ “ఆచార్య” ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కీలకపాత్రలో కన్పించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శంకర్ జరిపిన చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో హరీష్… చిరు, చరణ్ లతో పాటు కొరటాల శివ నుంచి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఎప్పుడు చూడబోతున్నారు ? అనే విషయాన్నీ చిరంజీవి రివీల్ చేశారు.
Read Also : Bhavadeeyudu Bhagat Singh : మెగా లీక్… పవర్ ఫుల్ డైలాగ్ !
రామ్ చరణ్ ‘రచ్చ’ విడుదలైనప్పుడు ‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ జరుగుతోంది. ‘రచ్చ’ మూవీ సూపర్ హిట్ అంటూ వరుసగా ఫోన్లు వస్తున్నాయి. అయితే పవన్ ‘ఏంటయ్యా ఆ ఫోన్లు?’ అని అడిగారు. చరణ్ ‘రచ్చ’ విడుదలైంది. మూవీ బాగుందట అని చెప్పాను. అప్పటిదాకా గంభీరంగా ఉన్న పవన్ వెంటనే కూల్ అయిపోయి డ్యాన్స్, యాక్టింగ్ బాగా చేశాడా ? అంటూ ప్రశ్నించారు అంటూ అప్పట్లో జరిగిన ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు హరీష్. ఇక పనిలో పనిగా ‘ఆచార్య’ను పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు చూపిస్తున్నారు ? అని ప్రశ్నించగా, “త్వరలోనే… దానికోసం ప్రత్యేకంగా థియేటర్ ను కూడా బుక్ చేశాము. అందరం కలిసి సినిమా చూస్తాము” అంటూ అసలు ప్లాన్ ను వెల్లడించారు ‘ఆచార్య’. అయితే ఆ థియేటర్ ఏంటి ? ‘ఆచార్య’ స్పెషల్ షో ఎక్కడ ? అన్న విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో ఉంచారు.