ప్రతి డైరెక్టర్ కూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మనసులో మాట బయట పెట్టారు దర్శకుడు కొరటాల శివ. శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఎప్పటికైనా స్వామి వివేకానందపై చిత్రం తీయాలన్నది తన కోరిక’ అని తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వీక్షించాలంటే ‘గాంధీ’ చిత్రం స్థాయిలో అది ఉండాల’ని కొరటాల అభిప్రాయ పడ్డారు. ‘మీడియా, సోషల్ మీడియా ఇవాళ్టి మాదిరి విస్తృతంగా లేని రోజుల్లోనే వివేకానంద ఈ దేశంపై ఎంతో ప్రభావం చూపించార’ని తెలిపారు.
Read Also : Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్
వివేకానందపై గొప్ప చిత్రం తీయగలిగే అనుభవం వచ్చిన రోజున, మరింతగా పరిశోధన చేసి తప్పకుండా తాను తీస్తాన’ని కొరటాల శివ అన్నారు. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్ తయారు చేసుకోవడం ఏ రచయిత, దర్శకుడికైనా ఇష్టమేనని, ఆ రకంగా చూసినప్పుడు వివేకానందుడి జీవితమే అందుకు ఉదాహరణ’ అని కొరటాల తెలిపారు. స్వామి వివేకానంద జీవితమన్నా, బోధనలన్నా కొరటాల శివకు ఎంతో ఇష్టం. వివేకానంద ఆలోచనలను, ఆదర్శాలను కొరటాల శివ అవకాశం కుదిరినప్పుడల్లా తన సినిమాల ద్వారా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.