చిరంజీవి, రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర దర్శకుడు శివ కొరటాల తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో తన నెక్స్ట్ మూవీ గురించి ఓపెన్ అవుతూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. తాత్కాలికంగా ‘ఎన్టీఆర్ 30’ అని పిలుచుకుంటున్న ఈ సినిమా గురించి కొరటాల మాట్లాడుతూ ఈ మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ కాదని, అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ అని అన్నారు.అంతేకాదు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.
Read Also : Kiccha Sudeep : నా రెస్పాన్స్ కన్నడలో అయితే… హీరోల ట్విట్టర్ వార్
ఎన్టీఆర్ కోసం చిరకాలం గుర్తుండిపోయేలా ఓ అద్భుతమైన క్యారెక్టర్‌ని డిజైన్ చేశానని కొరటాల చెప్పారు. ఇక ఈ సినిమా జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుందని, ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో క్రేజీగా చూపించబోతున్నాము అంటూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఇక ‘ఆచార్య’ విషయానికొస్తే… చిరు, చరణ్ లతో పాటు పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ యాక్షన్ డ్రామాలో సోనూసూద్ విలన్ గా కనిపించబోతున్నాడు.