రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ను ఉరితీయాలని రక్షాబంధన్ రోజున అతడి సోదరి డిమాండ్ చేసింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్ల గురించి తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నట్లు ఆమె చెప్పింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రక్షాబంధన్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తున్న కూలీల పికప్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, పలువురు చిన్నారులు సహా 29 మంది గాయపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో రక్షా బంధన్ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తోబుట్టువులకు రాఖీలు కడుతున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో.. రాఖీ షాపులు, స్వీట్ షాపులు కలకలలాడుతున్నాయి. రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు
కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది.
సాధారణంగా పిల్లలను అమ్మేయడానికో, బిక్షాటన చేయించడానికో కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను, స్కూల్ నుంచి వస్తున్న వారిని, ఫుట్ పాత్ పై పడుకున్న వారిని కిడ్నాప్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ జంట ఫుట్ పాత్ పై పడుకున్న నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసింది. పోలీసుల విచారణలో కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని వారు వివరించారు. అది విన్న పోలీసులే విస్తుపోయారు. ఇలా కూడా కిడ్నాప్ చేస్తారా అనుకుంటూ…
ఈ రక్షా బంధన్‌కు మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?. మీరు మీ సోదరికి ఏదైనా బహుమతిగా ఇవ్వాలని చూస్తున్నట్లయితే.. ఈ బహుమతులను వారు ఇష్టపడడమే కాకుండా చాలా ఉపయోగకరంగానూ ఉంట రక్షాబంధన్ కోసం మీ తోబుట్టువులు ఇష్టపడే కొన్ని బహుమతుల జాబితా ఇక్కడ ఉంది. అయితే మీ కోసం కొన్ని బహుమతులను తెలియజేస్తున్నాం. అవేంటో చూడండి
సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా మహిళామణులకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రక్షాబంధన్ సందర్భంగా మహిళలు 48 గంటల పాటు మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ఢీకొట్టబోతున్నాడు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంటే ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా విడుదలను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నారు. Read Also : మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అనుకుంటున్నారు… కానీ…! బాలీవుడ్…