భారతదేశం పక్కనే ఉండే పొరుగు దేశం నేపాల్ కూడా రక్షా బంధన్‌ను జరుపుకుంటుంది. అయితే ఇక్కడ వివిధ సంఘాలలో జరుపుకునే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. నేపాలీ బ్రాహ్మణులు మరియు ఛెత్రీ కమ్యూనిటీలో ఈ ప్రత్యేకమైన రోజును జనై పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజున నేపాలీ పురుషులు 6 కాటన్ దారాలతో జనైని ధరిస్తారు. అయితే దీనికి నేపాల్ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ థ్రెడ్లు స్వచ్ఛత మరియు రక్షణను సూచిస్తాయి. మరోవైపు ఇక్కడి నెవార్ కమ్యూనిటీ క్వాతీ పున్హిగా జరుపుకుంటారు. తెరాయ్ ప్రాంతంలోని హిందువులు రక్షా బంధన్‌గా జరుపుకుంటారు. అయితే నేపాల్‌లో రక్షా బంధన్ పండుగను ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఇంటి అద్దె తెలిస్తే షాకే.. ఓ పది ఇళ్లు కొనేయొచ్చు..!
రక్షాబంధన్ అంటే జనై పూర్ణిమ సందర్భంగా ధరించే దారం.. దీనిని 6 రకాల దారాలతో తయారు చేస్తారు. కుడి భుజం నుండి నడుము వరకు ధరిస్తారు. ఈ 6 థ్రెడ్‌లకు ఓ ప్రాముఖ్యత ఉంది. 3 దారాలు బ్రహ్మ, విష్ణు, మహేషులకు చిహ్నమైతే.. మిగిలిన మూడు థ్రెడ్‌లు జ్ఞానం, ఆరాధన మరియు చర్యను సూచిస్తాయని తెలుపుతున్నారు. ఆ రక్షాసూత్రాన్ని పత్తి దారంతో తయారు చేస్తారు. ఇది పవిత్ర బంధంగా పరిగణిస్తారు. నేపాలీ బ్రాహ్మణులలో ఇది వారి జీవిత ప్రాముఖ్యతగా కనిపిస్తుంది. పిల్లవాడు పెద్దవాడైనప్పుడు ఇది ధరిస్తారు.
KA Paul: స్టీల్‌ప్లాంట్‌పై కేఏ పాల్ డెడ్‌లైన్.. లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష..!
దేవుడు ఆ వ్యక్తితో దారం రూపంలో జీవిస్తాడని నమ్ముతారు. అందుకే ఇది స్వచ్ఛమైన శరీరం, ఆత్మ మరియు మనస్సుతో ముడిపడి ఉంది. అంతేకాకుండా.. దీనిని ధరించడం వల్ల ఒక వ్యక్తిని చెడు విషయాల నుండి కాపాడుతుందని చెబుతారు. ప్రతి జనై పూర్ణిమ నాడు, నేపాలీ బ్రాహ్మణులు మరియు ఛెత్రీ కమ్యూనిటీ ప్రజలు దానిని మార్చి కొత్త జానాయిని ధరిస్తారు. దీనిని ధరించిన వారిని సంస్కార్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇది ధరించిన బ్రాహ్మణులు మాంసం, చేపలు తినరు. ఈ ప్రక్రియకు ఒక రోజు ముందు పాక్షిక ఉపవాసం పాటిస్తారు. అంతేకాకుండా.. ఉల్లిపాయలు, వెల్లుల్లికి దూరంగా ఉంటారు.
Moon: ఇదేందయ్య ఇది.. ఏకంగా చంద్రుడిపై స్థలం కొని తల్లికి గిఫ్ట్ ఇచ్చిన కూతురు..
జనై పూర్ణిమ నాడు లాంగ్టాంగ్ నేషనల్ పార్క్‌లో 4,380 మీటర్ల లోపల నిర్మించిన సరస్సులో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు స్నానం చేస్తారు. ఇది మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నేపాల్‌లోని నెవార్ కమ్యూనిటీ దీనిని క్వాతి పున్హిగా జరుపుకుంటారు. జానై కాకుండా వారి చేతులకు దారం (డోర) ధరించే సంప్రదాయం ఉంది. పురుషులు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజారి దారంతో వారిని కట్టివేస్తారు. మరుసటి రోజు ఈ దారాన్ని విప్పి ఆవుకి కడుతారు. మానవుడు చనిపోయిన తర్వాత.. ఆవు స్వర్గానికి మార్గం చూపుతుందని నమ్ముతారు.
Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి.. 3 విమానాశ్రయాలు మూసివేత
రక్షా బంధన్‌ను నేపాల్‌లో రక్షా బంధన్ అంటారు. తెరాయ్ ప్రాంతంలోని హిందువులు దీనిని జరుపుకుంటారు. ఈ కమ్యూనిటీలో రక్షా బంధన్ భారతదేశంలో ఎలా సంప్రదాయంగా జరుపుకుంటారో.. అదే విధంగా జరుపుకుంటారు. సోదరీమణులు సోదరులకు రక్షాసూత్రాన్ని కడుతారు. భారతదేశంలో లాగా నేపాల్ లో కూడా సోదరుడికి తిలకం పెట్టి కుడి చేతికి రాఖీ కడుతారు.