రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.
జమ్మూ కశ్మీర్‌లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. ఎల్‌ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్మీని పాక్ అడ్డుకుంది. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.
'ఆపరేషన్ సిందూర్'తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం..
Rajouri: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. గత నెల రోజులుగా 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ మిస్టరీకి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు. మిస్టరీ ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే వాదనని ఆయన తోసిపుచ్చారు. డిసెంబర్ 7 నుండి జనవరి 19 వరకు జరిగిన ఈ మరణాలు రాజౌరిలోని మారుమూల బాధాల్ గ్రామంలోని మూడు కుటుంబాలలో సంభవించాయి. Read Also: Saif…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద ల్యాండ్ మైన్ పేలింది. భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు. సాధారణ గస్తీలో భాగంగా జవాన్లు ఆ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో అనుకోకుండా మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. Read Also: Adam Gilchrist: ‘బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు.. జుట్టు మీద కాదు’.. భారత్ బ్యాటర్ పై కీలక…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని అనారోగ్యం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ గుర్తు తెలియని అనారోగ్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 08కి చేరింది. బుధవారం ఇక్కడ ఆస్పత్రిలో మరో చిన్నారి వ్యాధి కారణంగా మరణించింది. దీంతో ఈ వ్యాధిని గుర్తించేందుకు కేంద్రం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన భారీ ఉగ్రదాడిని సైన్యం భగ్నం చేసింది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఒక సైనికుడు గాయపడినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కోసం భారీగా బలగాలను మోహరించింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. గత 24 గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ముగ్గురు సైనికులు మొత్తంగా ఐదుగురు వీరమరణం పొందారు. గురువారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరణించిన వారి ఫోటోలు పేర్లను ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో గత 24 గంటలుగా ఎన్‌కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు.
Jammu Encounter: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈరోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు.