జమ్మూ కశ్మీర్‌లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. ఎల్‌ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని ఆర్మీ అడ్డుకుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాల్పులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది. కాగా.. జమ్మూలోని సున్నితమైన ప్రాంతాల్లో మళ్లీ బ్లాక్‌అవుట్ విధించారు. అనేక సున్నితమైన ప్రాంతాలలో సైరన్ల శబ్దం ప్రతిధ్వనిస్తోంది. పాకిస్థాన్ కాల్పుల తర్వాత.. జమ్మూ ప్రాంతంలో మళ్ళీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ డివిజన్‌లోని రాజౌరి, పూంచ్, సాంబాలలో కూడా బ్లాక్‌అవుట్ విధించారు.
READ MORE: India-Pakistan War: పాక్ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.. భారత రక్షణశాఖ స్పష్టం..
మరోవైపు.. భారత ప్రభుత్వం దేశంలోని అనేక ప్రదేశాలలో అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలకు తక్షణమే భద్రతా చర్యలను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు భద్రతా చర్యలను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఆదేశించిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని విమానాశ్రయాలలో ప్రయాణీకుల సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ (SLPC) చేయనున్నారు. టెర్మినల్ భవనంలోకి సందర్శకుల ప్రవేశం నిషేధించారు. తదనుగుణంగా ఎయిర్ మార్షల్స్‌ను మోహరిస్తారు. SLPC అనేది విమానం ఎక్కే ముందు చేసే అదనపు భద్రతా తనిఖీ. విమానం లోపలికి అనుమానాస్పద వస్తువు తీసుకోకుండా ఈ తనిఖీలు చేస్తారు.