Jammu Kahmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో రాజౌరీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మంగళవారం సాయంత్రం జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ లాబ్రడార్ కాల్పుల్లో మరణించింది.
జమ్ముకశ్మీర్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే మూడుసార్లు జమ్ము కశ్మీర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుసార్లు భూమి కంపించింది.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్‌కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. బారాముల్లా ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి భద్రతా బలగాలు. వరసగా మూడో రోజు కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.
జమ్మూలోని రౌజౌరీలో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం, ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.