లోక్సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదిర్చే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు అప్పగించారు. మంగళవారం లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థికి సంబంధించి రక్షణ మంత్రి ఇంట్లో బీజేపీ, మిత్రపక్షాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్పీకర్ పదవిపై చర్చ జరిగింది.
PM Modi New Cabinet: లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు హాజరయ్యారు.
Rajnath Singh: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గురించి మాట్లాడుతూ..
భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తుండటంతో పాటు రాజ్యాంగ ప్రవేశికను తాము మార్చాలని చూస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.
వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే.
ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
లోక్సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ మోడీ సర్కార్పై బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ క్యాబినెట్లో ఇద్దరు (రాజ్నాథ్, గడ్కరీ) తప్ప.. మిగతా వారంతా ‘యెస్’ అంటూ తలూపేవారేనని విమర్శించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను భారత్లో విలీనం చేస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు.