Navy Radar Station: దామగుండంలో నెవీ రాడార్ స్టేషన్.. శంకుస్థాపన చేసిన రాజ్ నాథ్ సింగ్, రేవంత్ రెడ్డి
- దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్..
- శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్- సీఎం రేవంత్‌రెడ్డి..
- పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి- బండి సంజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Radar Station: దామగుండం నెవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తోంది. శంకుస్థాపన స్థలానికి చేరుకున్న రాజనాథ్ సింగ్‌కు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు మరికొందరు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ స్టేట్ కీలక అడుగు ముందుకు వేసిందన్నారు.
Read also: Ponnam Prabhakar: గురుకుల పాఠశాలకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు..
Also Read
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
దేశ రక్షణ శాఖా వ్యవస్థ కోసం హైదరాబాద్ నిలయంగా ఉందన్నారు. దేశంలో సముద్ర మార్గంలో ప్రయాణించే వ్యవస్థ కోసం వికారాబాద్ లో వీ.ఎల్.ఎఫ్ ఏర్పాటు హర్షణీయం అని తెలిపారు. వికారాబాద్ లో రెండవ వీ ఎల్ ఎఫ్ ఏర్పాటు చేస్తుంటే అపోహలు సృష్టిస్తున్నారన్నారు. దేశ భద్రత రక్షణ కోసం తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ప్రాజెక్ట్ ప్రారంబించాలని రాజ్ నాథ్ సింగ్ నాతో మాట్లాడారు వెంటనే ఆదిశగా అడుగులు వేశామన్నారు. దేశ రక్షణ కోసం ప్రభుత్వంలో ఉన్న మేమంతా పాటు పడుతామని తెలిపారు. వి ఎల్ ఏ స్టేషన్ ప్రాజెక్ట్ చేపడుతున్న చోట ఇక్కడ రామలింగేశ్వర దేవాలయం ఉంది భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరుతున్నానని తెలిపారు. ఇదిలా ఉండగా 10 ఏళ్ల క్రితమే రాడార్ సెంటర్ ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభించినా. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దామగుండం అటవీ ప్రాంతంలో 2900 ఎకరాల భూమిని కేటాయించి రాడార్ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!