ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.…
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. గురువారం అన్ని రాజకీయ పార్టీలతో జరిగి ఆల్ పార్టీ మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్రమైన ప్రతీదాడి ఉంటుందని రక్షణ మంత్రి చెప్పారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అన్ని రాజకీయ పార్టీల నేతలకు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అయితే, భద్రతా కారణాల వల్ల సున్నితమైన విషయాలను ప్రభుత్వం పంచుకోలేదని…
All-Party Meet: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కోడ్‌నేమ్‌తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. బుధవారం తెల్లవారుజామున భారత్ పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించి పీఓకే, పాక్ భూభాగాల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కార్యాలయాలతో పాటు ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లపై విరుకుపడింది.
Operation Sindoor: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన గత అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు నిన్ననే సమావేశమై ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్…
ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. రక్షణమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. HYD: భారత సైన్యానికి మద్దతుగా నేడు సంఘీభావ ర్యాలీ. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ర్యాలీ. సాయంత్రి 6 గంటలకు ర్యాలీ ప్రారంభించనున్న సీఎం రేవంత్. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. అమరావతి రీ-లాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాల కేటాయింపుపై చర్చ. సీఎం చంద్రబాబు అధ్యక్షత ఉదయం 11…
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. భారతదేశం ఈ ప్రతీకార చర్యల్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు.
Rajnath Singh: 26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్…
Rajnath Singh: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే దౌత్యపరమైన దాడిని ప్రారంభించింది. ఇక మిలిటరీ యాక్షన్ ఏదైనా ఉంటుందా..? అనే దానిపై దేశ ప్రజలు మాట్లాడుతుకుంటున్నారు. తాజాగా, ఆదివారం, త్రివిధ దళాల చీఫ్, చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని ఆయన నివాసంలో కలిశారు. వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది