Rajnath Singh: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ శుక్రవారం ఉదయం ప్రధాన రక్షణ అధికారి అనిల్ చౌహాన్, త్రిదళాల చీఫ్‌లతో ఢిల్లీలో అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ కింద భారత్ చేపట్టిన ప్రతీకార దాడుల అనంతరం ఏర్పడిన భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు జరగనున్నట్లు సమాచారం.
Read Also: Indian Army:భారత వైమానిక దళాల కౌంటర్ స్ట్రైక్.. పాక్ మిలిటరీ పోస్ట్‌లు ధ్వంసం.. వీడియో వైరల్
గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలు, నగరాలపై మిసైళ్లతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడులు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అదేవిధంగా జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను కూడా టార్గెట్ చేశారు. అయితే, భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి అన్ని దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ఈ దాడుల నేపథ్యంలో శ్రీనగర్, జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో రాత్రంతా బ్లాక్‌ఔట్ అమలులోకి రావడంతో విద్యుత్ విభాగం నిలిచిపోయింది. దీనితో ప్రజల్లో ఒకింత ఆందోళన కలిగించింది.
Read Also: JD Vance : భారత్-పాక్ వివాదంలో జోక్యం చేసుకోం.. అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
ఇకపోతే, భారత భద్రతా బలగాలు ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ చొరబాట్లకు గట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. నిఘా సమాచారం మేరకు, అనేక పాకిస్తాన్ మిలిటరీ పోస్టులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో యాంటీ-టాంక్ గైడెడ్ మిసైళ్ళు (ATGMs) ఉపయోగించారని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్బంగా.. భారత సైన్యం ఒక ప్రకటనలో “పాక్ బలగాలు గత రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడులు చేశాయి. అంతేగాక, జమ్ము కశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద అనేక సీస్ఫైర్ ఉల్లంఘనలు చేశారు. వీటన్నిటికీ తగిన జవాబు ఇచ్చాం అని పేర్కొంది. భారత సైన్యం దేశ భూభాగ సమగ్రతను కాపాడటానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఎలాంటి కుట్రలకైనా గట్టి బలంతో సమాధానం ఇస్తుందని ఆర్మీ ప్రకటించింది.