సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రముఖ దర్శకుడి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారట. అందుకే ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం “అన్నాత్తే”. ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై, మంచి విజయాన్ని సాధించింది. తమిళనాట కురిసిన భారీ వర్షాలు సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించాయి.…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శశికళ భేటీ అయ్యారు. రజనీకాంత్ తో ఆయన భార్య లత కూడా వున్నారు. రజనీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఐడీఎంకె లో పార్టీ పదవుల పంపకం వేళ రజనీకాంత్ తో భేటీ అయ్యారు శశికళ. రెండు రోజుల క్రితం పార్టీ కోఆర్డినేటర్ పదవికోసం నామినేషన్ దాఖలు చేశారు ఈపీఎస్, ఓపిఎస్. ఏకగ్రీవంగా ఎన్నికలకు వీరిమధ్య సయోధ్య కుదిరింది. పార్టీ బాధ్యతలు ఓపిఎస్ కు ఇచ్చేందుకు ఈపీఎస్ అంగీకరించారు. ఈనేపథ్యంలో రజనీకాంత్‌తో…
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్…
కోవిడ్-19 కారణంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న ఇటీవల ఆయన యూఎస్ ట్రిప్ ముగించుకుని వచ్చారు. ఆ సమయంలోనే దగ్గు రాగా, కమల్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లి, వైద్యుల సూచనతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమల్ అభిమానులకు స్వయంగా తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న సాయంత్రం ఆయన కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కమల్…
మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఘటనతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా దూషించారని, ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగుపెడతా అంటూ చంద్రబాబు శపథం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను రెండున్నర ఏళ్లుగా అనేక రకాలు దూషించారని కానీ ఈ రోజు నా సతీమణిని కూడా దూషించారంటూ మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై యావత్తు టీడీపీ, నందమూర అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నందమూరి కుటుంబ…
దీపావళికి విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం ఇప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పటికీ ‘పెద్దన్న’జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పలు చోట్ల థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం విశేషం. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లు దాటింది. ఈ వారం చివరికల్లా ఈ సినిమా 250 కోట్ల రూపాయల…
రజనీకాంత్ తో సినిమా చేయాలన్నది తమిళ దర్శకుల కల. ఆ కలను ‘అన్నాత్తే’తో నెరవేర్చుకున్నాడు శివ. తెలుగులో గోపీచంద్ సినిమాతో దర్శకుడైన శివ తమిళంలో వరుస విజయాలతో టాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘అన్నాత్తే’తో కమర్షియల్ హిట్ కూడా సాధించాడు. నిజానికి ఈ సినిమా అవకాశం శివకు తను అంతకు ముందు డైరెక్ట్ చేసిన ‘విశ్వాసం’ వల్లే లభించిందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా రజనీనే. ‘అన్నాత్తే’ అనుభవాలను వాయిస్ నోట్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన 12 రోజులు అవుతుంది. గుండెపోటుతో ఆయన మరణించడం కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్ అని లేకుండా చిత్ర పరిశ్రమ అంతా పంత్ కి నివాళులు అర్పించారు. కొంతమంది పంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించగా.. మరికొంతమంది ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా పునీత్ కి సంతాపం తెలిపారు. “పునీత్.. నీ మరణాన్ని నేను…
స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించటం ఎంతో కష్టమని ఎంతో మంది సంగీతదర్శకులు చెబుతూ వస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ కూడా చేరారు. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు ట్యూన్స్ ఇవ్వవలసి రావటం ఎంతో వత్తిడితో కూడిన వ్యవహారం అంటుంటారు. రెహమాన్ కూడా రజనీకాంత్ చిత్రాలకు పనిచేయటం నరకమే అని చెబుతున్నాడు. రజనీకాంత్ నటించిన ‘ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0’ చిత్రాలకు…
గత కొంతకాలంగా రజనీకాంత్ నుండి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదనే బాధ అతని అభిమానులకు ఉంది. ఏదో ఒక జానర్ కు ఆయన పరిమితమైపోతున్నారని, మరీ ముఖ్యంగా ‘కబాలి, కాలా, పేట, దర్బార్’ వంటి చిత్రాలతో ఒకే తరహా వర్గాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారని వారంత భావిస్తున్నారు. ఈసారి ఆ లోటును తీర్చడానికన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ విత్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘పెద్దన్న’ను చేశాడు రజనీకాంత్.…