సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని సినిమా నరసింహ.. రజినీ స్టైల్, రమ్యకృష్ణ పొగరు, సౌందర్య అందం.. వెరసి ఈ సినిమా ఒక చార్ట్ బస్టర్. ఇప్పటికి ఎక్కడో ఒకచోట ఈ సినిమాలోని సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా రజినీ, రమ్యకృష్ణ ల మధ్య రివెంజ్ సన్నివేశాలు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక అలాంటి నెం. 1 జోడీ మళ్ళీ రిపీట్ కానుందని సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవర్ 169 చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా ఎప్పుడో ప్రకటించినా ఇంకా సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేదు. ఇక మధ్యలో నెల్సన్ .. విజయ్ తో కలిసి బీస్ట్ ని తెరకెక్కించాడు. అది కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడమా లేదన్నది వాస్తవం.
ఇక మరోపక్క బీస్ట్ ఎఫెక్ట్ తో రజినీ ఈ సినిమాకు పక్కన పెట్టినట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే అందులో నిజం లేదట.. అంతేకాకుండా ఈ సినిమాపై అంచలములు పెంచేలా స్టార్ క్యాస్టింగ్ ను ఎంపిక చేస్తున్నాడట నెల్సన్.. ఈ సినిమాలో ఒక పాత్రకోసం రమ్యకృష్ణను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట డైరెక్టర్.. అది కూడా నెగెటివ్ రోల్ అని సమాచారం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘నరసింహ’ లో నరసింహ, నీలాంబరి ఛాలెంజ్ డ్రామా ఎంత రసవత్తరంగా ఉందో , ఈ చిత్రంలో వీరి కాంబో కూడా వీర లెవెల్లో ఉండనున్నదని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సిందే.