సూపర్ స్టార్ రజినీకాంత్ కు గత కొన్నేళ్లుగా విజయం అందనంత దూరంలో ఉంది.. హిట్ దర్శకులను నమ్ముకున్నా కూడా రజినీని మాత్రం ఆ ప్లాప్ ల నుంచు గట్టెక్కించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన ‘పెద్దన్న’ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెల్సిందే. ఇక ప్రస్తుతం రజినీ ఫ్యాన్స్ అందరూ తలైవర్ 169 మీదనే ఆశలు పెట్టుకున్నారు. ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం.. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. బెస్ట్ ప్లాప్ తో నెల్సన్ ఈ సినిమా కోసం స్టార్ డైరెక్టర్ బి.రవి కుమార్ హెల్ప్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను బి రవికుమార్ అందించనున్నాడట. అంతేకాకుండా స్టార్ క్యాస్టింగ్ ను కూడా రంగంలోకి దింపుతన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ చిత్రంలో రజినీ కోసం మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ను సంప్రదించారని సమాచారం.. ఇప్పటికే ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ లో స్టార్ హీరోయిన్ రమ్య కృష్ణ నటిస్తుందన్న విషయం విదితమే.. ఇక తాజాగా ఐష్ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పిందని తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. రజినీ – ఐష్ హిట్ కాంబో అన్న సంగతి తెలిసిందే. 2010లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన’రోబో’ సినిమాలో ఈ జంట సందడి చేశారు. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పన్నెండేళ్ల తరువాత రజినీ మళ్లీ ఐష్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఇక మరో కీలక పాత్రలో కుర్ర హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇంతమంది స్టార్ క్యాస్టింగ్ ను నెల్సన్ హ్యాండిల్ చేయగలడా..? ఇన్నేళ్లు ఎదురుచూస్తున్న రజినీ ఫ్యాన్స్ కు హిట్ ను అందివ్వగలడా..? అనేది తెలియాల్సి ఉంది