Chinmayi : రజినీ, కమల్ లపై కామెంట్స్… ముఖ్యమంత్రులనూ వదల్లేదుగా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. #MeToo అంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల విషయంపై రచ్చ జరుగుతున్న సమయంలో ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాజాగా చిన్మయి మరోసారి సినీ, రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా తన గళం విప్పింది. శుక్రవారం చిన్మయి తన వరుస ట్వీట్లలో లైంగిక వేటగాళ్ళు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే మహిళలు ఎలా సురక్షితంగా భావిస్తారని ప్రశ్నించారు.
Read Also : Bheemla Nayak : థియేటర్లో తమన్ రచ్చ… వీడియో వైరల్
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
“స్త్రీలకు వేధించే వ్యక్తి పేరును బయట పెట్టడం ఎందుకు కష్టమో మీకు తెలుసా? ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి, గౌరవనీయులైన కేరళ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ, గౌరవప్రదమైన ఎంపీ కనిమొళితో కలిసి వేదికను పంచుకుంటానని వేధింపులకు కారణమైన వాడు చెప్పాడు. ప్లస్ మిస్టర్ కమల్ హాసన్, మిస్టర్ రజనీకాంత్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఈ దేశంలో మహిళల భద్రత గురించి తాము శ్రద్ధ వహిస్తున్నామని ఎవరైనా… ఎవరైనా చెబితే – ఈ ఈవెంట్‌కు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీల నుండి హాజరవుతున్న ప్రముఖులను సెక్స్ నేరస్థుల గోతిలో ఎగిరి గంతేయమని అడగండి. వారు అనుభవం నుండి నేర్చుకుంటారు. ఈ దేశం, అనేక మంది రాజకీయ నాయకులు, స్త్రీలు, పురుషులు… ఎవరైనా వేధింపులకు పాల్పడితే పట్టించుకోవడం లేదు. 20 మంది మహిళలు అతని పేరును బయట పెట్టారు కూడా. ఇలాంటి దేశంలో మీ పిల్లలను బాగా పెంచండి ఆల్ ది బెస్ట్” అంటూ వ్యంగ్యంగా వరుస పోస్టులు చేసింది. ఈ దేశం అమ్మాయిలకు ఒక అగ్నిగుండంలా మారింది అంటూ ఓ నెటిజన్ కోపాన్ని ప్రదర్శించగా, “కాదు. ఈ దేశం మహిళలపై లైంగిక వేధింపుల గొయ్యి… ముఖ్యంగా రాజకీయంగా లైంగిక వేధింపులకు దేశం మద్దతు ఇస్తుంది” అంటూ చిన్మయి మండిపడింది.

తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!