సినిమా అభిమానులు తమ అభిమాన హిరోలు, హిరోయిన్లపై ఒక్కోలాగా తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఓ అభిమాని సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తమిళ నాడు తిరుచ్చిలోని ఓ హోటల్ యజమాని కర్ణన్ తన అభిమాన నటు డు రజినీ కాంత్ పై అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. అన్నా త్తే సినిమా విడుదల సందర్భంగా రూపాయికే దోశను అందజేస్తూ పేదల కడుపు నింపుతున్నాడు ఈ హోటల్ యజమాని కర్ణన్. అన్నా త్తే సినమా సూపర్…
తెలుగులో తమిళ హీరోల మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ టాప్ లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో రజనీకాంత్ సినిమా ఎప్పుడు విడుదలైనా తమిళంలోలాగే పండుగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా రజనీకాంత్ నటించిన “అన్నాత్తే” చిత్రం విడుదలైంది. శివ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం “పెద్దన్న” అనే ఈ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లోని…
సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే దీపావళి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖూష్బూ, మీనా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కావడంతో తలైవా ఫ్యాన్స్ కి పండగ వాతావరణం మొదలైయిపోయింది. రజినీ మూవీ అంటే ఫస్ట్ డే.. ఫస్ట్ డే పడాల్సిందే.. ఆరోజు స్కూల్ ఉందా.. ఆఫీస్ ఉందా..? ఇంట్లో…
ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు తెలుగులో విడుదల అవుతుండగా, మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా, డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ “పెద్దన్న”, విశాల్ “ఎనిమీ” రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన…
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా టైటిల్ ప్రకటించినప్పటికీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ వరకు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. కాగా ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్లో 1100 థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఒక తమిళ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓవర్సీస్ విడుదల అని…
సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల జనరల్ చెకప్ కోసం కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీ నాలుగు రోజులు అన్ని టెస్టులు చేయించుకొని తాజాగా ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఇక రజినీకాంత్ డిశ్చార్జ్ కావడంతో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రజినీ అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న…
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం వల్లే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి ఆస్పత్రి శుక్రవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను…
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు. Read Also: తమన్నా పరువు అడ్డంగా తీసిన ‘మాస్టర్ చెఫ్’ యాజమాన్యం ‘నువ్వు…
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీర్తి కిరీటంలో తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో మరో కలికి తురాయి చేరింది. సహజంగా జాతీయ సినిమా అవార్డులను, పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందిస్తారు. అయితే ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ తో పాటు సినిమా రంగానికి చెందిన అవార్డు గ్రహీతలు పురస్కారాలను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్, ఆయన శ్రీమతి లత న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను,…