మేగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ ను దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీని వచ్చే యేడాది జనవరి 7వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి తెలిపాడు. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను జనవరి 7 ఎక్స్ పీరియన్స్ చేయొచ్చని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నాడు. రిలీజ్ డేట్ ను…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది…
(సెప్టెంబర్ 27తో ‘స్టూడెంట్ నం.1’కు 20 ఏళ్ళు) యంగ్ టైగర్ యన్టీఆర్ తొలి ఘనవిజయం, దర్శకధీరుడు రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’. 2001 సెప్టెంబర్ 27న ‘స్టూడెంట్ నంబర్ వన్’ జనం ముందు నిలచింది.వారి మదిని గెలిచింది. ఆ సినిమా చూసినప్పుడే నందమూరి అభిమానులు ‘మనవాడు మహా గట్టివాడు… స్టార్ హీరో అయిపోయాడు…’ అనుకున్నారు. ‘ఎవరో కొత్త దర్శకుడు రాజమౌళి అట… భలేగా తీశాడు…’ అని ప్రేక్షకులు అన్నారు. వారిద్దరూ రాబోయే కాలంలో అనూహ్య…
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు” ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తొలివారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఎన్టీఆర్ మ్యాజిక్ కారణంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. అప్పుడే షో మొదలై మూడు వారాలు గడిచిపోయింది. అయితే గత కొన్ని రోజుల “ఎవరు మీలో కోటీశ్వరుడు” షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి కన్పించాడు. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో రాజమౌళి ఈ షోకు…
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేయాలన్నది జక్కన్న ఆలోచన. అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. అయితే మహేష్ బాబుతో…
టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ అంటే రాజమౌళి, ప్రభాస్ దే. ఇప్పటికే వీరి కలయికలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సీరీస్ వచ్చి ఘన విజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చాలా సంవత్సరాల క్రితమే భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళితో…
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్నట్లుగానే మరోసారి వాయిదా పడింది. కరోనా పాండమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రకటించినా అది సాధ్యం కావటం లేదు. రీ-షూట్ చేస్తున్నారు… గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదు అంటూ పలు రకాల ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ వస్తోంది. వాయిదా విషయాన్ని యూనిట్ ట్వీట్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్…
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంన్న “ఆర్ఆర్ఆర్”ను అక్టోబర్ 13న విడుదల చేస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పాడు. అయితే అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదల కావడానికి కొత్త ముహూర్తం కోసం చూస్తున్నారని, కొత్త రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకానొక సమయంలో “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ విషయం ఎటూ తేలక, మరోవైపు జక్కన్న కూడా “ఆర్ఆర్ఆర్” విడుదల విషయంలో నోరు మెదకపోవడంతో టాలీవుడ్ మొత్తం అయోమయానికి…
స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో వారి అభిమానుల మనసుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. అలానే ఎగ్జిబిటర్స్ సైతం ఒకవేళ భారీ మొత్తం చెల్లించేసిన తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ బాట పడితే… తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పెన్ స్టూడియోస్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి సంబంధించి ఓ క్లారిఫికేషన్ ను ఇచ్చింది. Read Also : సినిమా థియేటర్ల ఆన్ లైన్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా సినిమా ఈ రోజు ఉదయం పూజతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, రణ్వీర్ సింగ్, రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు, తమన్ తదితరులు హాజరయ్యారు. రామ్ చరణ్ పై తీసిన మొదటి షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్…