టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్‌తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ, బాస్కర్, దశరధ్, అజయ్ భూపతి, మోహన్ రాజా, గుణశేఖర్, బి గోపాల్ తదితరులు ఈ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ప్రీమియర్ షోకి ఈ టాప్ దర్శకులందరి నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం.
Read Also : పుష్ప : దుమ్మురేపుతున్న “నా సామీ రారా సామీ” సాంగ్
ఆకాష్, కేతికా శర్మల నటన, ‘రొమాంటిక్’ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం, సాంకేతిక నిపుణుల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రమ్యకృష్ణ అద్భుతమైన నటన, పూరి డైలాగ్స్‌తో పాటు ఆకాష్ నటన, కేతికతో అతని రొమాన్స్, ట్విస్టులు, పాటలు, యాక్షన్ పార్ట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్టోబర్ 29న రిలీజ్ కానున్న “రొమాంటిక్” నాగశౌర్య “వరుడు కావలెను” సినిమాతో క్లాష్ కానుంది. ఆకాష్ పూరి ‘రొమాంటిక్’తో తన అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకుంటున్నాడు. సినిమా ఫలితంపై బృందం చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందని, అదే సమయంలో ఫ్యామిలీతో పాటు ఇతర వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని వినికిడి.