“ఆర్ఆర్ఆర్” బిగ్ అప్డేట్… గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న ముంబైలో జరిగిన ఈవెంట్ లో విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. “ఆర్ఆర్ఆర్” విడుదలయ్యే వరకూ పీవీఆర్ “పీవీఆర్ఆర్ఆర్”గా కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. గ్లింప్స్ ను నవంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నామని ప్రకటిస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కూడిన పోస్టర్ ను వదిలారు మేకర్స్. ఈ వీడియో కేవలం 45 సెకన్లు ఉంటుందని, ఇందులో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు.
Read Also : అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా “ఆర్ఆర్ఆర్” విడుదల తేదీ చాలా సార్లు వాయిదా పడింది. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది.
- Tags
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
- RRR Glimpse
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!