దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోగా కల్పిత కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఇక ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రాజమౌళిది ప్రత్యేకమైన శైలి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం రాజమౌళి దుబాయ్‌లో “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో “రోబో 2.0” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిపారు. అయితే ఒక తెలుగు సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను ఇలా దుబాయ్ వేడుకగా భారీగా ప్లాన్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. “బాహుబలి”తో టాలీవుడ్ ను అగ్రస్థానంలో నిలబెట్టిన రాజమౌళి ఇప్పుడు ప్రమోషన్ల విషయంలోనూ సరికొత్త బాటలో సాగుతున్నారు.
Read Also : రికార్డు బ్రేకింగ్ ధర కు “రాధేశ్యామ్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్
డివివి దానయ్య నిర్మిస్తున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్”ను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి ముందుగా షెడ్యూల్ చేశారు. అయితే తరువాత “ఆర్ఆర్ఆర్” విడుదలను వాయిదా వేసి 2022 జనవరి 7న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కాగా “ఆర్ఆర్ఆర్”లో తారక్, రామ్ చరణ్, ఒలీవియా మోరిస్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సిఎంమా థియేట్రికల్ రిలీజ్ అనంతరం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లు ZEE5లో, కొరియన్, హిందీ, పోర్చుగీస్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయబడతాయి.