దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వంటి స్టార్స్ సైతం ఇందులో భాగం అయ్యారు. గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీ 7 జనవరి 2022 న థియేటర్‌లలోకి వస్తుందని రాజమౌళి ప్రకటించాడు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది.
Read Also : సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ !
ఈ మాగ్నమ్ ఓపస్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డబ్బింగ్ ను పూర్తి చేశారు. మలయాళం వెర్షన్ కోసం కొన్ని చిన్న రీ-రికార్డింగ్, డబ్బింగ్ పనులు మినహా, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే దశలో ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్, జీ5 సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్ విడుదల తర్వాత సినిమా తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ వెర్షన్‌లు జీ5 లో అందుబాటులో ఉంటాయి. హిందీ, కొరియన్, పోర్చుగీస్, టర్కిష్, స్పానిష్ వెర్షన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతాయి.