MP Midhun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. దానితో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి తీసుకుని వెళ్లుతున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది, ఏసీబీ పోలీసులు ప్రత్యేక వాహనంలో రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుంది. రిమాండ్ పొడిగింపు నిమిత్తం విజయవాడ…
ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల మధ్యంతర బెయిల్ గడువు పూర్తి కావడంతో సెంటర్ జైల్లో సరెండర్ అయ్యారు మిథున్ రెడ్డి..
ఏపీలో వైఎస్సార్సీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. సిట్ అధికారులు ఓ వైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు.. మరోవైపు, ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
రాజమండ్రి సెంట్రల్ జైలుపై డ్రోన్ కలకలం సృష్టించింది.. సెంట్రల్ జైలు సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. వరుసగా రెండు రోజులపాటు సెంట్రల్ జైలు పైకి డ్రోన్ రావడంతో జైలు సూపరింటెండెంట్ రాహుల్ అప్రమత్తమై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణ మొదలయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను…