ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే.. రీసెంట్ గా ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ప్రపంచ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మక 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును గెలుచుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా సినీజనాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించే 'ఆస్కార్ అవార్డుల'పై వాటికంటే ముందు ప్రకటించే 'గోల్డెన్ గ్లోబ్ అవార్డుల' ప్రభావం ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఆ తీరున ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో రూపొందిన 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు...” పాటతో 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో ఆయనకు దక్కిన ' గోల్డెన్ గ్లోబ్ అవార్డ్' బారతీయుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది…