Keeravani Golden Globes: ప్రపంచ వ్యాప్తంగా సినీజనాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించే ‘ఆస్కార్ అవార్డుల’పై వాటికంటే ముందు ప్రకటించే ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డుల’ ప్రభావం ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఆ తీరున ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో రూపొందిన ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాటతో ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆయనకు దక్కిన ‘ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్’ బారతీయుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటి దాకా భారతదేశ సినీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అంశాన్ని రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ ద్వారా ఆయన అన్న కీరవాణి తన సంగీతంతో సుసాధ్యం చేయడంతో తెలుగువారిలో మరింత ఆసక్తి నెలకొంది.
Read also: Manik rao Thackeray: తెలంగాణలో ఠాక్రే పర్యటన.. అక్కడకు రావాలని కోమటిరెడ్డి ఫోన్
గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా భారతీయుడైన ఎ.ఆర్. రహమాన్ కూడా ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ముందు గోల్డెన్ గ్లోబ్ ను అందుకొని, తరువాత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ ను కూడా సొంతం చేసుకున్నారు. అదే తీరున కీరవాణి సైతం తప్పకుండా ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…”పాటతో ఆస్కార్ సాధిస్తారని ఇండియన్ మూవీ గోయర్స్ ఆశిస్తున్నారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ద్వారా రహమాన్ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. కానీ, ఆ సినిమా భారతీయ చిత్రం కాదు. గతంలోనూ ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న భారతీయులు కూడా ఆంగ్లేయులు నిర్మించిన చిత్రాల ద్వారానే అందుకున్నారు తప్ప నేరుగా భారతీయ భాషల్లో తెరకెక్కిన సినిమాల ద్వారా అది సాధ్యం కాలేదు. ఈ కోణంలో ప్రప్రథమంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఘనత తెలుగువారయిన కీరవాణికి దక్కడంతో తెలుగువారు మరింత ఆనందిస్తున్నారు. అందువల్లే ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ద్వారా ఆస్కార్ నామినేషన్ కూడా సంపాదించి అవార్డు గెలుచుకోవాలని భారతీయులు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆశిస్తున్నారు. ఈ నెల 24న ఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదలవుతుంది. అందులో తప్పకుండా ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” సాంగ్ చోటు చేసుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. అందుకు ఊతంగా నిలచింది ప్రస్తుతం కీరవాణి ముద్దాడిన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్’.
Varisu: ట్విట్టర్ రివ్యూ… దిల్ రాజు మంచి ఛాన్స్ మిస్ అయ్యాడట
తొలి నుంచీ గోల్డెన్ గ్లోబ్స్ ప్రభావం ఆస్కార్ అవార్డులపైనా ఉందని చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే, సింహభాగం గోల్డెన్ గ్లోబ్స్ లో అవార్డులు దక్కిన సినిమాలే ఆస్కార్ బరిలోనూ విజేతలుగా నిలిచాయి. అందువల్ల కీరవాణి అందుకున్న గోల్డెన్ గ్లోబ్ మనవాళ్ళలో ఆస్కార్ పై ఆశలను రెట్టింపు చేస్తున్నాయి.
Varisu: ట్విట్టర్ రివ్యూ… దిల్ రాజు మంచి ఛాన్స్ మిస్ అయ్యాడట