Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే.. రీసెంట్ గా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును గెలుచుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. దీనిపై తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘RRR’ మూవీలో నాటు నాటు పాట తెలియని వారు ఉండరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రలకు బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్-హార్డీల డ్యాన్స్‌లో RRR హీరోలలో కనిపించినంత ఎనర్జీ ఉండకపోవచ్చు..కానీ పర్వాలేదు. ఎంజాయ్ చేయండి అంటూ ఆనంద్ మహీంద్రా తెలిపారు.. నాటునాటు మేనియా ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రజలు పర్ఫెక్ట్ ఫ్రైడే అంటూ సంబపరపడి పోతున్నారు అంటూ ట్విట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
Read also: China Manja: నాగోల్ చిన్నారి మాంజా ఘటన.. చైతన్యపురి సీఐ సీరియస్ వార్నింగ్
కామెడీ కింగ్స్ బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్-హార్డీ స్టెప్పులేస్తున్న వీడియోను ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సూపర్ గా సెట్ అయ్యిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే మహీంద్ర ట్విట్ కు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్లా కూడా దీనిపై స్పందించారు. సంగీతం, నృత్యం, సినిమాలకు సాంస్కృతిక, భాషా, జాతీయ లేదా అంతర్జాతీయ సరిహద్దులు లేవన్నారు సుచిత్రా. మూకీ సినిమాల కాలం నుంచి ఇది ప్రపంచ వ్యాప్తంగా రుజువైంద అంటూ ఆమె ట్వీట్ చేసింది. నాటునాటు పాటకు స్ఫూర్తిగా నిలిచిన ఈ వీడియో గతేడాది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం సంగతి తెలిసిందే.
Read also: Bandi Sanjay: రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం
అయితే మరికొందరు మీరు ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు మీరు ఏకీభవిస్తు్న్నారా? నిజంగానే నాటు నాటు పాటకు అంత సీను లేదా? నాటు నాటు పాటలో ఎనర్జీ లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నించుకుంటున్నారు. నాటు నాటు పాటకన్నా ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసిన వీడియోలో వారు చేసిన డ్యాన్స్ సూపర్ అంటూ మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.
No wonder music , dance & cinema have no boundaries of culture , language , national, international , now or from the past too !! proven world over since the time of silent movies !!
— Suchitra Ella (@SuchitraElla) January 13, 2023
Master Plan: భోగి రోజు భగ్గుమన్న కామారెడ్డి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గులతో నిరసన